ఇవ్వాలెందుకో గాని బ్లాగాలని మనసు ఒకటె లాగుడు, సరె ఇక ఆగడమెందుకు అని బ్రౌసెర్ ఒపెన్ చేసాను. ఇక్కడె వచ్చింది అసలు చిక్కు,బ్లాగడం అన్నది ఎంతొ ఓపిక తొ కూడుకున్న వ్యవహారం అని తెలిసొచ్చింది, మధ్యలొ ఈ విసుగుడు పర్వం ఏంటి మహశయా అంటె, ఇదిగొ నా సమాధానం.ఇవ్వాళ నెను చెప్ప బొయెది యండమూరి గారి "విజయానికి ఆరొ మెట్టు" గుర్చి ( మిగిలిన అయిదు మెట్లు చదివిన ఫలం గుర్చి ఆరా తీస్తె నెను నోరు వెల్ల బెట్టడం తప్ప ఎమి చెయ్యలెను). ఈ పుస్థకం ఆసాంతం చదివిన వారికి దాని గుర్చి బ్లాగాలంటె ఈ మాత్రం ముందస్తుగ కొద్దిగ ధైర్యం మరియు అంతొ ఇంతొ మన భాధ ని చెప్పుకొవాలి కద.
విషయానికొస్తె, రోజు మొత్తం కంప్యూటర్స్ తొ సహవాసం చెసె నెను ఈ యాంత్రిక జీవితపు తాంత్రిక మహత్తు( ప్రాస బాగా కలిసింది కదా( నా బొటి వాల్లకు ప్రొత్సాహం అందిస్తె మీ సొమ్ము ఎమీ పొదు సుమీ, ఆ మాత్రం అశ్యూరెన్స్ ఇవ్వడానికి నెను రెడి).ఆ తాంత్రిక మహత్తు నుండి బయట పడి పుస్తకాలు తీస్తె, ఈ పుస్తకం అగుపించింది. కవరు పేజి లొ మన యందమూరి గారు నిమ్మళంగ కూర్చొని వున్నారు, ఎమిటో ఈయనగారి ఆరొ మెట్టు అని ఒపెన్ చెశాను. భగవద్గీతకు సరి కొత్త భాష్యం అని కనిపించింది. పుస్తకం చూస్తె విధ్యార్తులకు అన్నాడు, మరి వారికి భగవద్గీత చదివె ఒపిక ఉంతుంద అని క్షన కాలం పాటు ఆవెసించి ఆలొచించి మల్లి తిరిగి నా లుక్కులను బుక్కులొనికి కుక్కాను(మల్లి ప్రాస గొడవ కదా). కాని అంథర్ముఖం నవల చదివిన అనుభవం తొ నా యత్నం కొన"సాగించడానికె" వొటు వెసా.కాని మనసులొ ఎదొ ఒక మూల చిన్న సందెహం, ఇప్పుదున్న గీత సరిపోద?, ఈయన గారు క్రిష్ణ భగవానుడి వువాచ కె భాష్యం చెప్పె అంత ఘటికుడా అని నాలొ ఒక సందెహం. నాలాంటి భడుద్దాయిల సంగతి మన రచయిత కి బాగా యెరుక అనుకుంటా, తన ప్రయత్నం సాహసోపెతమని, గీత కు భాష్యం చెప్పడంలొ తన ఉద్దెశ్యం దాని గొప్పదనానికి లోటు వచ్చి కాదు, దానిని అర్థం చెసుకోలెని యాంత్రిక జీవితపు బానిసలకు (ఇంకెవరు నాలాంటి వాల్లు + మీలాంటి వాల్లు = మన లాంటి వాల్లు[ ఒక్కసారైన నిజం ఒప్పుకొండి]) ఈ పుస్తకం అని చెప్పి నన్ను ఒప్పించాడు. ఈ పుస్తకపు ముందు మాట ఒక ప్రముఖ సిని గెయ రచయిత చె వ్రాయబడింది. ఇందులొ ఉన్న అధ్యాయలన్ని చాలా ముఖ్యమైన సారాన్ని కలిగి ఉంటాయి, వాటి సారం చెప్పె సాహసం నెను చెయ్యను. ఇందులొ క్లుప్తంగ చెప్పడానికి వీలుకాదు, ప్రతి ఒక పదం ఎంతొ అనుభవ సారాన్ని మనకు భొదిస్తుంది, చిన్న చిన్న కథల రుపేణ మనకు భొదించె భాద్యతను భుజస్కందాల మీద వెసుకున్న రచయితకు ధన్యవాదాలు. పుస్తకం మొత్తం సారం చెప్పలెనందుకు క్షమించండి, ఒక సారి వీలయినపుడు మల్లి ఆ పుస్తకపు విషయాలను చర్చించుకుందాం,
సెలవు
మీ
రాజు
Showing posts with label యండమూరి వ్రాసిన "విజయానికి ఆరొ మెట్టు" ని పరిచయం చెస్తాను... రండి. Show all posts
Showing posts with label యండమూరి వ్రాసిన "విజయానికి ఆరొ మెట్టు" ని పరిచయం చెస్తాను... రండి. Show all posts
Sunday, December 23, 2007
Subscribe to:
Posts (Atom)